ఉక్రెయిన్ అధ్యక్షుడు, భద్రతా సిబ్బంది వాహనాలను ఓ ప్యాసింజర్ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వల్పంగా గాయపడ్డారు.. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి అధికారికంగా వెల్లడించారు. అధ్యక్షుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తీవ్రమైన గాయాలేమీ కాలేదు అని అధ్యక్ష ప్రతినిధి సెర్గీ నైకిఫోరోవ్ పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన ప్యాసింజర్ కారులోని వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.