జేఈఈ మెయిన్స్ తొలి సెషన్ ఫలితాలు విడుదల


ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఫలితాలను ఉంచారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు 9 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో పేపర్‌-1 (బీఈ, బీటెక్‌) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్‌-2 (బీర్క్‌, బీప్లానింగ్) పరీక్షకు 46వేల మంది హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. దాదాపు 95.8 శాతం మంది పరీక్షకు హాజరుకావడం ఇదే తొలిసారి.

జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున తొలి సెషన్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జేఈఈ తొలి సెషన్ పరీక్షల ప్రాథమిక కీని ఎన్‌టీఏ ఫిబ్రవరి1వ తేదీన విడుదల చేయగా, ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు అభ్యర్ధుల అభ్యంతరాలను స్వీకరించింది.