సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఇటీవలే ముంబయిలోని ఒక అపార్ట్‌మెంట్ ఆరవ అంతస్తు నుండి దూకి ఆత్మ హత్య చేసుకున్న విషయం తెల్సిందే. నితిన్ కపూర్ ఆత్మ హత్యకు పూర్తిగా ఆర్థిక కారణాలే అని తేలిపోయింది. కొందరు ఆర్థిక కారణాలు కాదు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాని నితిన్ కపూర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, అందుకే ఆయన మనస్సుకు కష్టం అనిపించి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే నితిన్ కపూర్‌కు ఆర్థిక ఇబ్బందులు ఏంటి, ఆయన భార్య జయసుధ ఒకప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ఒక సర్పంచ్ లేదా వార్డ్ నెంబర్ భారీగా సంపాదిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే డబ్బే డబ్బు అన్నట్లుగా సంపాదిస్తున్నారు. జయసుధ ఎమ్మెల్యేగా చేసి ఎంతో కాలం కాలేదు. అవినీతి ఎక్కువగా జరుగుతుందని అంతా భావించే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె ఎన్నికల్లో గెలిచేందుకు పెద్దగా కష్టపడ్డది, ఖర్చు చేసినది కూడా ఏమీ లేదని తెలుస్తోంది.
అయినా కూడా జయసుధ ఎమ్మెల్యేగా ఏమీ సంపాదించుకోలేక పోయిందని స్థానిక నాయకులు అంటున్నారు. అవినీతి ఎలా చేయాలి, రాజకీయాన్ని ఉపయోగించుకుని ఎలా సంపాదించుకోవాలని అనే విషయాలు ఆమెకు తెలియలేదు. అందుకే జయసుధ ఎమ్మెల్యేగా చేసినా కూడా ఆర్థిక ఇబ్బందులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జయసుధ కాస్త మనస్సు పెడితే ఇప్పుడు నితిన్ కపూర్ బతికి ఉండేవాడేమో అని ఆమె సన్నిహితులు అంటున్నారు.