సినిమాల్లో ఎంతో భవిష్యత్ ఉన్నప్పటికీ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌ను తాను అభినందిస్తున్నానని అన్నారు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ . జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఈ రోజు యప్రకాశ్ నారాయణ భేటీ అయ్యారు.
ఈ సమావేశం అనంతరం జేపీ మాట్లాడుతూ.. విభజన హామీల అమలు కోసం వేదిక ఏర్పాటు చేయాలన్న పవన్ ఆలోచనకు తాను మద్దతిస్తున్నానని చెప్పారు. హామీలను ఏ రకంగా సాధించాలన్న అంశంపై అందరూ కలిసి చర్చిస్తామని తెలిపారు. విభజన హామీలు అమలు జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అందరం కూర్చొని వేదిక ఏర్పాటు చేయాలన్న పవన్ కల్యాణ్ ఆలోచనకు తాను మద్దతిస్తున్నానని వెల్లడించారు.
అలాగే రాష్ట్ర విభజన విషయంలో పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించి చట్టం చేసిన తర్వాత కూడా విభజన హామీలను అమలు చేయలేదని ఏరు దాటక తెప్ప తగలేశారని కేంద్రంపై మండిపడ్డారు జేపీ.