రాష్ర్ట రాజకీయాల్లోకి ‘జయప్రద’..?

jayaprada-in-AP-politicsసినీనటి, లోక్ సభ సభ్యురాలు జయప్రద పదేళ్ల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నేడు (బుధవారం) తిరుమలలో తన జన్మదినోత్సవం జరుపుకోవడానికి వచ్చిన సందర్బంగా.. ఈ విషయాన్ని జయప్రద సూచన ప్రాయంగా వెల్లడించారు. అయితే ఏ పార్టీలో చేరబోయేది ఈ నెలాఖర్లో ప్రకటిస్తానని ఆమె ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన జయప్రద తర్వాత ఉత్తర్ ప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలో పనిచేశారు. ప్రస్తుతం సమాజ్ వాది పార్టీ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా, గత కొద్దికాలంగా ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నట్లుగా వార్తాలొస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం ఎటువంటి ఆటంకాలు లేవని ఆమె ఇప్పటికే స్పష్టం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా తనకు అన్ని పార్టీల నుండి ఆహ్వానం ఉందని తెలియజేస్తూ.. ఏపార్టీలో చేరిన రాష్ట్ర రాజకీయాల్లోకి మాత్రం వస్తానని ఆమె వెల్లడించింది