ఎన్డీయే ’జయ’ హో.. !!

modi-and-jailalitha

ఎన్డీయే కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయి. కేంద్రంలో రాబోయేది ఎన్డీయే కూటమేనని పలు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న నేపథ్యంలో.. వివిధ ప్రాంతీయ పార్టీలు ఎన్డీయే కూటమికి జై కొడుతున్నాయి. తాజాగా, ఈ జాబితాలోకి తమిళనాడుకు చెందిన అధికార అన్నాడీఎంకే కూడా వచ్చి చేరింది. జయలలిత ఎన్డీయే ధరికి చేరేందుకు రెడీ అయినట్లు సమాచారమ్. నిజానికి జయలలితకు భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తత్సబంధాలు వున్నాయి. ఇవే జయ ఎన్డీయే కూటమిలో చేరేందుకు కారణమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎన్డీయేకు షరతులతో కూడిన మద్దతిస్తామని ఒడిశాలోని అధికార బీజూ జనతాదళ్ ప్రకటించింది. మరికొన్ని పార్టీలు సైతం ఎన్డీయే పక్షానికి చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మొత్తానికి.. ఎన్డీయే బలం రోజు రోజుకు బలపడుతోంది.