జ‌న‌సేన‌పై స‌హ‌జ‌న‌టి కామెంట్‌

jayasudhaప‌వ‌న్ పార్టీపై సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు. సీనీ న‌టి క‌మ్ రాజ‌కీయ‌నాయ‌కురాలు జ‌య‌సుథ ప‌వ‌న్ పార్టీపై త‌న అభిప్రాయాన్ని చెప్పారు. ప‌వ‌న్ పార్టీకీ స్వాగ‌తిస్తూనే ఎంట్రీ కాస్త లేట్ అయ్యింద‌న్నారామె. ఇది ప్ర‌జాస్వామ్య‌దేశం. ఎవ‌రైనా రాజ‌కీయాల్లోకి రావ‌చ్చు. ఆ స్వేచ్ఛ అంద‌రికీ ఉంది. అలానే.. ప‌వ‌న్‌ నీ ఆహ్వానిస్తున్నా. అయితే చిరంజీవి ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన‌ప్పుడే ప‌వ‌న్‌.. ఇలా చేసి ఉండాల్సింద‌ని, ఇప్ప‌టికి ప‌వ‌న్ పార్టీకి ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌గ‌లిగే బ‌లం చేకూరుద‌ని చెప్పారు జ‌య‌సుథ‌. ప‌వ‌న్ నిజాయ‌తీ ఉన్నావాడ‌ని, గెలిచినా – ఓడినా స‌మాజానికి మంచి చేయాల‌నుకోవ‌డం చాలా మంచి ఆలోచ‌న అని.. అదే ప‌వ‌న్‌ కి ఆయుధ‌మ‌న్నారామె.