Site icon TeluguMirchi.com

జపాన్ సముద్రంలో నాలుగు దేశాల యుద్ధ విన్యాసాలు


జపాన్ సముద్రంలో జరిగిన బహుళ దేశాల సముద్ర విన్యాసాలు మలబార్-22 లో భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలను ప్రదర్శించాయి. ఈ సారి 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ విన్యాసాలతో పలు అంశాలను దేశాలు ప్రదర్శించాయి.

ఈస్టర్న్ ఫ్లీట్ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లా నేతృత్వంలోని ఈస్టర్న్ ఫ్లీట్ షిప్‌లు శివాలిక్, కమోర్టా భారత నావికాదళానికి ప్రాతినిధ్యం వహించాయి. మలబార్ సిరీస్ విన్యాసాలు 1992లో భారత్, అమెరికా నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక విన్యాసాలుగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా, జపాన్ నౌకాదళాలలో చేరడంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మలబార్ 22 విన్యాసాలు యోకోసుకా సమీపంలో ఐదు రోజుల పాటునిర్వహించారు. ప్రత్యక్ష ఆయుధ కాల్పులు, ఉపరితల, జలాంతర్గామి లలో లక్ష్యాలను ఛేదించే ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Exit mobile version