ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 8న ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా సిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
తొలి విడత ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేయనున్నట్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు అందిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ పై వైసిపి నేతలు చౌకబారు విమర్శలు మానుకోవాలని… రైతులకు సాయం అందించడంపై దృష్టి పెట్టాలన్నారు.