Site icon TeluguMirchi.com

పవన్ ’జనసేన పార్టీ’ ప్రోమో సాంగ్!!

pawan-kalyan-Jana-sena-flagపవన్ ’జనసేన పార్టీ’ ప్రకటనకు చకచకా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రేపు హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో ప్రాంగణంలో పవన్ పార్టీ ప్రకటన చేయనున్న విషయం తెలిసిందే. పవన్ ప్రెస్ మీట్ ను లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. పార్టీ ఫ్లాంగ్ కూడా ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. తాజాగా, జనసేన పార్టీ ప్రోమోసాంగ్ కూడా బయటకు వచ్చింది. ’జనసేన జనసేన.. ’ అంటూ సాగే ప్రోమో సాంగ్ యువతను ఆకర్షించేలా, ప్రభుత్వాన్ని ప్రశించేలా వుంది. పవన్ జనసేన పార్టీ జెండా, ప్రోమోసాంగ్ లను మీకు అందిస్తోంది.. మీ తెలుగు మిర్చి డాట్ కామ్.

Exit mobile version