తిరుపతి లో జనసేన పార్టీ కార్యకర్త దారుణ హత్య

తిరుపతి నగరంలో దారుణం చోటుచేసుకుంది. జనసేన పార్టీ కార్య కర్త సుహానా భాషా ను అతి దారుణంగా హత్య చేసారు. పేరూరు చెరువు వద్ద కత్తులతో కిరాతకంగా కొంత మంది దుండగులు నరికి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసారు.

ఈ హత్య పై పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు కూడా సమాచారం ఇచ్చారు నాయకులు. ఈ హత్య నేపథ్యంలో.. ఇవాళ ఏపీ పవన్‌ కళ్యాణ్‌ కూడా పర్యటించే ఛాన్స్‌ ఉంది. ఇక హత్య చేసిన అనంతరం..ఆ దుండగులు పరారీ అయ్యారు. దీంతో పరారైన దుండగుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు.