ఇక పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల్లో కూడా తన పార్టీకి బలం ఉందని, తప్పకుండా రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తాను అంటూ ప్రకటించాడు. దాంతో తెలంగాణలో పవన్ సత్తా ఎంత అనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. గత కొంత కాలంగా తెలంగాణలో టీఆర్‌ఎస్ జెండా రెపరెపలాడుతుంది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలోనే జనసేనను కూడా తెలంగాణలో బలోపేతం చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లుగా పవన్ ప్రకటించాడు.
పవన్‌కు తెలంగాణలో భారీ అభిమానగణం ఉంది. కాని వారు అంతా కూడా రాజకీయంగా ఆయనకు మద్దతుగా నిలుస్తారా అనేది అనుమానంగా ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన మీటింగ్‌లు మరియు రోడ్ షోల్లో ప్రజలు బాగానే కనిపిస్తున్నారు. అంతమాత్రాన జనసేనకు టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టే సత్తా ఉందని భావించలేం. అలాగే రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు సైతం జనసేన పోటీ కాకపోవచ్చు.
జనసేనకు తెలంగాణలో బలమైన నాయకుడు లేడు. పవన్ కేవలం ఆంధ్రాకు పరిమితం అయిపోతాడు అనే టాక్ ఉన్న నేపథ్యంలో తెలంగాణలో జనసేనా మెరుగైన ఫలితాలను రాబడుతుందనే అభిప్రాయం మాత్రం వ్యక్తం కావడం లేదు.