Site icon TeluguMirchi.com

ఎంపీ అరవింద్‌ ఫై జనసేన ఫైర్

జనసేన పార్టీ ..గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే బిజెపికి మద్దతు ఇవ్వడం పట్ల కొంతమంది పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేస్తుంటే..బిజెపి ఎంపీ అరవింద్..జనసేన పార్టీ ఫై పలు కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అరవింద్ మాట్లాడుతూ..‌ జనసేనతో జీహెచ్‌ఎంసీ, భవిష్యత్తులో ఎలాంటి పొత్తు ఉండదని అన్నారు. దీనిపై జనసేన ఫైర్ అవుతుంది. ఢిల్లీ అగ్రనేతలు, తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కోరడం వల్లే… తెలంగాణలో పోటీని జనసేన విరమించుకుని.. బీజేపీకి మద్దతు ఇచ్చిందన్న ఆ పార్టీ.. ఎంపీ అరవింద్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడింది.

జనసేన పార్టీ ఏ పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందో మీకు తెలియకపోతే మీ అగ్రనాయకులను అడిగి తెలుసుకోండి. అంతే తప్ప జనసైనికులను రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడటం సరికాదు. ఎంపీ అరవింద్‌కు బీజేపీలో ఏం జరుగుతుందో తెలియదనుకుంట. అందుకే ఇలా పిచ్చి, పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ వ్యాఖ్యలను ఎంపీ అరవింద్‌ వెనక్కి తీసుకోవాలి” అంటూ జనసేన పేర్కొంది. ‌

Exit mobile version