ఢిల్లీకి వెళ్ళనున్న జానారెడ్ది..!

janareddyభవిష్యత్ కార్యాచరణ కోసం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు మంత్రుల నివాస ప్రాంగణంలో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మంత్రి జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశం కోసం కృషి చేసిన తెలంగాణ ఎంపీలకు, తెలంగాణ ఇవ్వాలని అఖిలపక్షంలో తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. నెల రోజుల తర్వాత కూడా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కొందరు నేతలు పనుల్లో ఉండలం వల్ల హాజరు కాలేదని దాన్ని వేరే కోణంలో చూడవద్దని, తామంతా తెలంగాణ విషయంలో ఐక్యంగా ఉన్నామని జానారెడ్డి చెప్పారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మాణం చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, సామరస్యంగా రాష్ట్ర విభజన చేయాలనీ, వచ్చే పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టాలని తీర్మాణం చేసినట్లు జానారెడ్డి తెలిపారు. అయితే ఈ రోజు సాయంత్రం జానారెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారని తెసింది. ఈ రోజు సమావేశంలో చేసిన తీర్మాం కాపీని జానారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ పెద్దలకు అందజేయనున్నట్లు సమాచారం.