Site icon TeluguMirchi.com

’జనసేన పార్టీ’ సభ్యత్వ నమోదు !

11113

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అజెండా రూపకల్పన బిజీగా వున్నారు. ఇందుకోసం భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనసేనలో చేరాలనుకునే వారు www.janasenaparty.org. వెబ్ సైట్ ద్వారా తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని ఆ పార్టీ అధికార ప్రతినిథి ఎం. రాఘవరావు ఓ ప్రకటన తెలిపారు. కాగా, నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనుకునే వారే తమ పార్టీలో చేరాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version