Site icon TeluguMirchi.com

జైపాల్ రెడ్డితో జానా భేటి

jana-jaipal-reddyకేంద్రమంత్రి జైపాల్ రెడ్డితో మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణపై కేంద్రం నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని హోంమంత్రి షిండే ప్రకటన నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు నిన్న భేటీ అయి చర్చించిన విషయాలను జైపాల్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జైపాల్ రెడ్డిని జానారెడ్డి కోరినట్లు సమాచారం. అనంతరం జానారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ను కలవనున్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మినహా తెలంగాణ సమస్యకు మరో పరిష్కారం లేదని.. వచ్చే పార్లమెంట్ సెషన్స్ లో తెలంగాణ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని, హై కమాండ్ను కోరుతూ టి కాంగ్రెస్ మీటింగ్ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని అధిష్టానానికి అందచేసేందుకు మంత్రి జానారెడ్డి హస్తిన రాగా ఇతర తెలంగాణ మంత్రులు త్వరలోనే ఢిల్లీకి పయనం అవుతారని సమాచారం.

Exit mobile version