ఈ చర్చలో తెలుగు రాష్ట్రాల ప్రధాన పార్టీలు అయిన టీఆర్‌ఎస్, వైకాపా మరియు తెలుగు దేశం పార్టీలు బిల్లుకు అనుకూలంగా మాట్లాడారు. అయితే హైదరాబాద్ ఎంపీ ఒవైసీ మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాడు. అక్కడి ప్రజల హక్కులను కాలరాయడంతో పాటు చైనా మాదిరిగా ప్రజాస్వామ్యంను కూనీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఆరోపించాడు. ఈ సందర్బంగా పలు పార్టీలకు చెందిన ఎంపీలు మాట్లాడుతూ మోడీ మరియు అమిత్ షాలను అభినందించారు. బిల్లు పాస్ అయినట్లుగా స్పీకర్ ప్రకటించడంతో సభలో హర్ధద్వనాలు వినిపించాయి. బీజేపీ ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు.