తెలంగాణ రాష్ట్రంలో వరుసగా అధికార పార్టీ నేతలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కరోనా బారిన పడగా..తాజాగా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కరోనా కు చిక్కుకున్నాడు. మంగళవారం ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులతో పాటు అంగరక్షకులకు కూడా పరీక్షలు చేయించగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
వీరిలో ఎమ్మెల్యే కూడా ఉండటంతో ఆయన హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మిగతా వారికి కోవిడ్ లక్షణాలు తక్కువగా ఉండటంతో హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఇటీవలే ఎమ్మెల్యే సురేందర్ కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఈయన కు కరోనా సోకినట్లు చెపుతున్నారు.