Site icon TeluguMirchi.com

ముసాయిదా బిల్లు, బిల్లు రెండూ.. ఒక్కటే!

jairam-rameshటీ-బిల్లుపై సీమాంధ్ర నేతలు మండిపడుతున్నారు. విభజన బిల్లు రాజ్యాంగ విరుద్దంగా వుందని వారు వాదిస్తున్నారు. అందువల్ల సభలో బిల్లును ఓడించి తిరిగి పంపాలని సమైక్య నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు, బిల్లుపై ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని, కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పాలని వాదిస్తున్నారు.

ఏపీ శాసనసభలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, టీ-బిల్లుపై సీఎం కిరణ్ స్వీకర్ కు అందజేసిన నోటీసుపై జీవోఎం సభ్యుల్లో ముఖ్యుడైన జైరాం రమేష్ స్పందించారు. ఈరోజు జైరాం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. బిల్లు, ముసాయిదా బిల్లు రెండూ ఒకటేనని స్పష్టం చేశారు. విభజన బిల్లు రాజ్యాంగ విరుద్దం అనడం సమంజసం కాదని ఆయన అన్నారు. అయితే, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే టీ-బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు జైరాం తెలిపారు. కాగా, శాసనసభ నుంచి బిల్లు వచ్చాక మరోసారి జీవోఎం సమావేశం వుంటుందని ఆయన తెలిపారు.

Exit mobile version