ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకున్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఆయనకి
వైద్య సిబ్బంది ఆయనకు కరోనా పరీక్ష చేయగా.. నెగిటివ్గా నిర్ధారణ అయింది. దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వచ్చిన అనంతరం సీఎం కరోనా పరీక్ష చేయించుకున్నారని సీఎంవో వెల్లడించింది.
కాగ ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 5, కడప జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి.