తిరుమలకు జగన్ ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్త్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ 23వ తేదీన తిరుమలకు వెళ్లనున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు స్వామి వారికీ సమర్పించడం ఆనవాయితీ.

ఈ ఏడాది కొవిడ్‌-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక కరోనా మహమ్మారి ప్రభావంతో తక్కువ సంఖ్యలో భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. అయితే స్వామి వారి సేవలను ఆన్ లైన్ లోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌ కళ్యాణోత్సవ సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులు నేరుగా కళ్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో.. భక్తుల కోరిక మేరకు గత నెల 7న సేవను టీటీడీ ప్రారంభించింది. దీనికి భక్తుల నుండి విశేష స్పందన వస్తున్నట్లు టిటిడి అధికారులు చెపుతున్నారు.