ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్కూల్ పిల్లలకు విద్యాకానుక ప్రకటించారు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులను కూడిన విద్యాకానుక ను జగన్ అందివ్వబోతున్నారు.
జగనన్న విద్యా కానుక కింద 3 జతల దుస్తులు(వస్త్రం), బెల్టు, ఒక జత షూ, రెండు జతల సాక్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ అందిస్తారు. దుస్తులను పాఠశాలల పేరెంట్స్ కమిటీల ద్వారా విద్యార్థుల తల్లులకు పంపిణీ చేయిస్తారు. ఒక్కో జతకు కుట్టుకూలి రూ.40 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేస్తుంది.
ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే 7 రకాల వస్తువులను విద్యార్థులకు అందించేందుకు సమగ్ర శిక్ష అభియాన్ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.