లాక్ డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులందరూ శుక్రవారం సొంత రాష్ట్రానికి వచ్చారు. గుజరాత్ నుంచి 12 బస్సుల్లో బయల్దేరిన మత్స్యకారులు శుక్రవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి గరికపాడు చెక్ పోస్టు వద్ద ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎస్పీ రవీంద్రబాబు ఘన స్వాగతం పలికారు.
ఈ నేపథ్యంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయిన ఏపీకి మత్స్యకారులను రాష్ట్రానికి తరలించడంలో సహకరించినందుకు విజయ్ రూపానీకి, అక్కడి అధికారుల బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.