టెలీ మెడిసిన్ ని మొదలుపెట్టిన జగన్

ఏపీలో టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం టెలిమెడిసిన్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి డాక్టర్‌తో మాట్లాడారు.

టెలీమెడిసిన్‌ విధానాన్ని పటిష్ఠంగా నడపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని నిత్యం పర్యవేక్షించాలని.. అవసరమైతే వైద్యుల సంఖ్య పెంచాలని సూచించారు. రాష్ట్రంలో టెలీమెడిసిన్‌ అమలుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 14410ని ప్రభుత్వం కేటాయించింది . దీని ద్వారా స్వచ్ఛంద సేవకు 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్‌లు ముందుకు వచ్చారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆరోగ్య సేవలు అందించనున్నారు.