Site icon TeluguMirchi.com

మందు బాబులకు బిగ్ షాక్ ఇచ్చిన జగన్

మద్యం తాగేవారి సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు మరో 50శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలు తెరిచే సమయానికే గతంలో ఉన్న రేట్లకంటే 25శాతం పెంచగా.. ఇప్పుడు అదనంగా మరో 50శాతం మేర పెంచారు.

పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో దాదాపు 44 రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకోవటంతో మద్యం ప్రియులు పోటెత్తారు. దీంతో వారిని అదుపు చేయటం సాధ్యం కాలేదు. మరో వైపు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Exit mobile version