ఏ పార్టీ లోనైనా అసంతృప్తి అనేది కామన్..కానీ అధికార పార్టీ లోనే అసంతృప్తి గళం మొదలు కావడం తో వైసీపీ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి జగన్ కు తలనొప్పిగా మారింది. మాజీమంత్రి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి… అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.
అయితే అధికారులపై వ్యాఖ్యలు చేస్తూనే ఆయన పరోక్షంగా ఏపీ సీఎం జగన్‌ను టార్గెట్ చేశారనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదని… ఇంత అధ్వాన్నపు అధికార యంత్రాంగాన్ని చూడలేదని ఆనం అనడం చర్చనీయాంశంగా మారింది