జులైలో మరోసారి సర్వే చేయాలని.. పరీక్షల విషయంలో వెనకడుగు వేయొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. పరీక్షల సంఖ్య క్రమంగా పెంచాలని అధికారులకు సూచించారు. క్యాన్సర్, డయాలసిస్ వంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృభిస్తుంది . గడచిన 24 గంటల్లో 6,552 శాంపిల్స్ పరీక్షించగా 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 893కు చేరింది.