Site icon TeluguMirchi.com

జగన్ సర్కార్ కి హై కోర్టు షాక్

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85ను రద్దు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ బిజెపి నాయకుడు సుదీష్‌ రాంబొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఏ మాధ్యమంలో చదవాలన్న అంశం విద్యార్థుల నిర్ణయానికే వదిలివేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచి ఈరోజు వెలువరించింది. జీవోలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం విద్యను తప్పని సరిచేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో పెద్ద రాజకీయమే జరిగింది.

Exit mobile version