Site icon TeluguMirchi.com

నిరాశలో జగన్?

jaganజగన్ కుటుంబం నిరాశలో కొట్టుమిట్టాడుతోందా ? జగన్ పార్టీ వ్యవహారాలను, పాలసీలను ప్రతిబింబించే సాక్షిలో వ్యాసాలూ చూస్తుంటే అలాగే అనిపిస్తూంది. మరో నాలుగు నెలల వరకు బెయిల్ వస్తుందన్న ఆశ లేకపోవడం, ఆ తరువాత కూడా కేసు సాగాదీతకే అవకాశం ఎక్కువ వుండడం, తమ రాజీ యత్నాలకు కాంగ్రెస్ వైపు నుంచి పెద్దగా సానుకూల వైఖరి కనబడక పోవడం, మరో పక్క జగన్ బయట లేకుండా పార్టీని పటిష్టంగా నడప లేకపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మరో పక్క కాంగ్రెస్ తన పార్టీని రిపేర్ చేసుకునే పని సీరియస్ గా చేస్తోంది. ఇక తెలుగు దేశం పార్టీ వ్యవహారాలు జోరందుకున్నాయి. చంద్రబాబు ఇప్పుడు పూర్తి స్థాయి లో పార్టీ కోసం పనిచేయడం ప్రారంభించారు. ఈ నేపధ్యంలో పంచాయతి, మున్చిపాల్టి ఎన్నికలు వచ్చేస్తున్నాయి. జగన్ బయట లేకుండా పార్టీ ని పటిష్టంగా నడిపే అవకాశం కనిపించడం లేదు. జనాభిమానం రోజు రోజుకు పలుచన అవుతోంది. ఏమి చేయాలో పాలు పోనీ పరిస్థితి. ఇవన్నీ ఇప్పుడు సాక్షి లో వార్తలు వ్యాసాల రూపంలో బయట పడుతోంది. చంద్రబాబు పై చెప్పిందే చెప్పడం, రాసిందే రాయడం ఈ విషయాన్ని దృవీకరిస్తున్నాయి.

మరో పక్క న్యాయస్థానాలను ఏమి అనలేక, అనే పరిస్థితి లేక, సిబిఐ పై దుమ్మెతి పోస్తున్నారు. లోపల వున్నా జగన్, బయట ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఇదీ తరహా పరిస్థితిలో చిక్కుకున్నారు. షర్మిల ప్రసంగాలు కూడా సాదా సీదాగా మారిపోయాయి. నిజంగా ఇది ఒక దయనీయ పరిస్థితి. తనకు తానూ ఎక్కువ అంచనా వేసుకున్న దాని ఫలితం. గోటితో పోయేదానిని గొడ్డలి దాక తెచుకున్న వైనం . ఎంపి పదవితో తృప్తి పది, కాంగ్రెస్ లో కొనసాగుతూ వుంటే మహారాజులా వుండే వాడేమో.

Exit mobile version