Site icon TeluguMirchi.com

జగన్ ఇల్లు రెడ్ జోన్ కాదు

తాడేపల్లిలోని సీఎం నివాసం రెడ్‌జోన్‌ పరిధిలోకి రాదని గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ వెల్లడించారు. నాలుగు పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతం రెడ్‌ జోన్‌ పరిధిలోకి వస్తుందని చెప్పారు. తాడేపల్లిలో ఒక కేసు మాత్రమే నమోదైందని తెలిపారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ ఈ మహమ్మారి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని,‌ డీజీపీ గౌతం సవాంగ్‌, మంత్రులు ఆళ్ల నాని, బొత్స , పలువురు అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version