ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర రైతులకు తీపి కబురు అందించారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు.. డిసెంబర్ 31లోగా పంట నష్ట పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి రూ. 500 ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ నిర్ణయం వల్ల ప్రతి కుటుంబానికి రూ. 2 వేలు ఆర్థిక సాయం అందుతుంది. అలాగే డిసెంబర్ 15లోగా పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని ఆదేశించాం. డిసెంబర్ 31లోగా పంట నష్ట పరిహారం చెల్లించాలని నిర్ణయించాం. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు కూడా అందిస్తాం. ఇళ్లు, పశువులు, ఇతర నష్టాలను కూడా డిసెంబర్ 15లోగా అంచనా వేస్తాం. డిసెంబర్ 31లోగా నష్టపరిహారం అందిస్తాం అన్నారు.