Site icon TeluguMirchi.com

చంద్రబాబును అర్జంటుగా పిచ్చాస్పత్రిలో చేర్పించాలి..

ఏపీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికారపార్టీ , ప్రతిపక్ష పార్టీల మధ్య మతాల యుద్ధం నడుస్తుంది. రెండో రోజు సైతం అసెంబ్లీ లో రచ్చ రచ్చ జరిగింది. తెలుగుదేశం పార్టీ సభ్యుల ఫై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబును అర్జంటుగా పిచ్చాస్పత్రిలో చేర్పించాలి. ఆయన వల్ల రాష్ట్రానికి, ప్రజలకు హానికరం. చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయనకు నరకంలో కూడా చోటు లభించదు. జగన్‌ మాట చెప్తే చేసి చూపిస్తాడు. విశ్వసనీయత అన్నది మనం చేసే పనుల వల్ల వస్తుంది. మాట చెప్తే నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజలను ఇవ్వగలిగాం. మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతం అమలు చేశాం. బిల్లులపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని అని ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుపై అసెంబ్లీలో విరుచుకుపడ్డారు.

Exit mobile version