Site icon TeluguMirchi.com

జగన్ నిర్ణయం: ఒక్కొ కుటుంబానికి రూ.కోటి పరిహారం

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకైన ఘటన జరగడం బాధాకరమని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.

ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10లక్షలు, గ్యాస్‌ ప్రభావం కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ.25వేలు, ప్రభావిత గ్రామాల ప్రజలకు రూ.10వేలు చొప్పున పరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేస్తున్నామని, దీనిపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని, నివేదిక పరిశీలించాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు జగన్.

Exit mobile version