ఆఖరి క్షణంలో జగన్ ఢిల్లీ టూర్ రద్దు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ కి బయలు దేరాల్సి ఉండగా ఆఖరి క్షణంలో టూర్ రద్దు అయ్యింది. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో, పోలవరం నిధుల గురించి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో చర్చించాలని సీఎం వైఎస్‌ జగన్‌ భావించారు.

షెడ్యుల్‌ ప్రకారం తాడేపల్లి నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం బయలుదేరి వెళ్లాల్సి ఉండగా, ఈ పర్యటన వాయిదా పడింది. త్వరలోనే మళ్లీ అపాయింట్‌మెంట్ ఖరారు కాగానే హస్తినకు వెళతారని అధికార వర్గాలు చెబుతున్నాయి.