జగన్ కు మళ్లీ నిరాశే.. !

jagan-bailఅక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్ కు మరోసారి నిరాశే ఎదురైంది. జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రీం తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారవుతాయన్న సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకభవించింది. గతంలో తీర్పును పరిగణనలోకి తీసుకుని సీబీఐ విచారణను నాలుగు నెలల్లోపు పూర్తిచేయాలని ఆదేశించింది. కాగా, జగన్ కేసులో జరిగిన అక్రమాస్తులన్నింటికి విజయసాయిరెడ్డి మూలమని, విజయసాయి రెడ్డి, జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ బయటకు వస్తే సాక్షులకు ఇబ్బందని సుప్రీం పేర్కొంది.