జగన్ ను ట్రంప్ తో పోల్చిన అచ్చెన్న

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని , మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పోల్చాడు తెలుగుదేశం నేత అచ్చెన్న . రాష్ట్రంలో గత కొద్దీ నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ పార్టీ తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ట్రై చేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు జగన్ దానిని వాయిదా వేస్తూ వస్తున్నాడు.

దీనిపై అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చి, గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అయితే, దీనిని ఆమోదించవద్దంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్‌ను కలవడం మరింత వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిపై ప్రతిపక్షం టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. సీఎం జగన్‌ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్‌తో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోల్చారు. ఎన్నికల భయంతో జగన్ వణుకుతున్నారని, స్థానిక ఎన్నికల వాయిదాకు అసెంబ్లీలో తీర్మానం చేయడం ట్రంప్‌ తరహా పోకడలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. కరోనా వల్ల ఎన్నికల వాయిదా కోరుతున్నామని చెప్పడం జగన్‌ పిరికితనానికి నిదర్శనమని అచ్చెన్న విమర్శించారు.