కరోనా అంటే భయం వదిలేయండి !

కరోనా వైరస్‌ సోకడం పాపం, నేరం కాదని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఇది ఎవరికైనా వ్యాపిస్తుందని చెప్పారు. కొవిడ్‌ పట్ల ప్రజల్లో భయాందోళన తొలగించాలన్నారు. పరీక్షలకు స్వచ్ఛందంగా జనం ముందుకు రావాలన్నారు. కనీస జాగ్రత్తలు, వైద్య సాయంతో ఈ మహమ్మారి నుంచి కోలుకోవడం సులభమేనన్నారు.

ఇదీలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 41మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో కరోనా మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు కోలుకొని డిశ్చార్జి అయినవారి సంఖ్య 1778కి పెరిగింది. మరోవైపు, కృష్ణా జిల్లాలో కొత్తగా మరో మరణం నమోదైంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 56కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 727 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.