ఏపీ సిఏం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు కురిపించారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఇష్టానుసారం తప్పించారని, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా జీవోలు తెచ్చిందని , ఈ వ్యవహారంలో జగన్ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.
లాక్ డౌన్ ఎత్తివేస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని మండిపడ్డారు. పరిపాలన చేతకావడంలేదని జగన్ చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. బాధ్యతగల నేతగా చంద్రబాబు రాష్ట్రానికి అనేక సూచనలు చేస్తున్నారని, చంద్రబాబుపైనా, టీడీపీ నేతలపైనా వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.