Site icon TeluguMirchi.com

ఉరిమి ఉరిమి జగన్ పైకి ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా చేసిన పలు వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో నాటు సారా ఏరులై పారుతోందని, ఇంత జరుగుతుంటే రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నిద్రపోతుందా? అంటూ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని కళా వెంకట్రావు ప్రస్తావిస్తూ, తమ్మినేని సీతారాం చేసిన‌ వ్యాఖ్యలపై ప్రజలకు ముఖ్యమంత్రి జగన్‌ సమాధానం చెప్పాలని అన్నారు.

సారా ఏరులై పారుతున్నందుకు ఏపీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలకు అవసరమైన పాలు, నీళ్లు దొరకడం కష్టంగా మారిందని, ఇటువంటి సమయంలో మద్యం మాత్రం వాలంటీర్ల ద్వారా డోర్‌ డెలివరీ చేస్తున్నారని కళా వెంకట్రావు అన్నారు.

నాటుసారా మాఫియాతో కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతున్నారని ,ఈ ముఠాలు సమాజాన్ని కంట్రోల్ చేసే స్థితికి చేరుకుంటున్నాయని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే

Exit mobile version