Site icon TeluguMirchi.com

అన్ని తెరవండి ..అవి తప్ప – జగన్

లాక్ డౌన్ 4 లో భాగంగా కేంద్రం తెలిపిన సడలింపులు బట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ప్రారంభం కావాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, మాల్స్‌, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు తప్ప మిగిలిన చోట్ల తగు జాగ్రత్తలు తీసుకుని ప్రారంభించాలని.. చిన్న చిన్న దుకాణాల నుంచి ప్రతిదీ తెరవాలని సూచించారు.

‘రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రజా రవాణా ప్రారంభమవుతుంది. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభమవుతాయి. తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలి.

ఈ రెండూ తప్పనిసరిగా పాటిస్తూ అన్నీ మొదలుకావాలి. ప్రస్తుతం నాలుగో విడత లాక్‌డౌన్‌లో ఉన్నాం. ఇంతకుముందు అనుసరించిన పద్ధతి వేరు.. ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్‌లో అనుసరించబోయే విధానం వేరు. ఈ విడతలో ఆర్థిక వ్యవస్థను పున్రఃపారంభించాల్సి ఉంటుంది. కరోనాపై ఎలాంటి అలక్ష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై దృష్టి సారించాలి. లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీనిని పట్టాలెక్కించాలంటే.. సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఆర్థిక రంగాన్ని దౌడు తీయిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేద్దాం’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

Exit mobile version