ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో నిర్ణయం తీసుకున్నారు. . రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, బాధితులకు అందుతున్న చికిత్స సహా ఇతర అంశాలపై సీఎం జగన్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ ప్రోటోకాల్ పూర్తిచేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు పేద బాధితులను గుర్తించి వారికి కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చేయాలని అధికారులకు తెలిపారు.
కాగ ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల అంతకంతకూ పెరుగుతూ ఆ సంఖ్య 500 దాటింది. నిన్న సాయంత్రం 5 నుంచి ఉదయం 9 వరకు కొత్తగా 19 కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 502కి చేరింది.