Site icon TeluguMirchi.com

ప్లీజ్ .. ఎక్కడివారు అక్కడే వుండండి: జగన్

రాష్ట్ర సరిహద్దు వద్దకు చేరుకుంటున్న వలస కూలీలకు సదుపాయాల కల్పన కష్టమవుతోందని.. మిగిలిన వారు సహకరించాలని కోరారు సీఎం జగన్‌ . పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఈ సందర్భంగా జగన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రయాణాల వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ప్రభుత్వం సూచనలను ప్రజలంతా పాటించాలని కోరారు.

కరోనా నివారణపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Exit mobile version