కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో జగదీశ్వర్‌రెడ్డి చురుకుగా పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, మాజీ కేంద్రమంత్రి మల్లికార్జున్ అనుచరుడుగా జగదీశ్వర్‌రెడ్డికి పేరుంది.
ఉద్యమ సమయంలో జైలుకు కూడా వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జగదీశ్వర్‌రెడ్డి కొంతకాలం టీఆర్ఎస్ పార్టీలోనూ ఉన్నారు. జగదీశ్వర్‌రెడ్డికి భార్య కుమారుడు నలుగురు కూతుళ్లు ఉన్నారు. వివాద రహితుడిగా పేరున్న ఆయన మృతికి అన్ని పార్టీల నాయకులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.