Site icon TeluguMirchi.com

ఈరోజే ఖమ్మంలో ఐటీ టవర్‌ ప్రారంభం

ఐటీ పరిశ్రమ కేవలం హైదరాబాద్ కే పరిమితం కాకుండా జంట నగరాల్లోనూ విస్తరింపజేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించనున్నారు.16 కంపెనీలు ఖ‌మ్మం ఐటీ హ‌బ్‌లో ప‌ని చేయ‌బోతున్నాయి. ఖ‌మ్మం యువ‌త‌కు ఐటీ హ‌బ్ ఓ ఆశాదీపంగా నిలవనుంది. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను రూ.27 కోట్ల వ్యయంతో నిర్మించారు. రెండేండ్లలోనే దీన్ని పూర్తి చేయడం విశేషం.

ప్రస్తుతం 430 మందిని నియ‌మిం‌చు‌కు‌న్నారు. త్వరలో మరో 430 మందిని నియ‌మిం‌చు‌కో‌ను‌న్నారు. దీంతో రెండు షిప్టుల్లో 860 మంది పని‌చే‌య‌ను‌న్నారు. ఖమ్మం ఐటీ టర్నో‌వర్‌ 50 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఉంటుం‌దని అంచనా వేస్తున్నారు. ఐటీ రంగం విస్తర‌ణతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యో‌గాలు, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి.

Exit mobile version