Site icon TeluguMirchi.com

సీమాంధ్ర లో కాంగ్రెస్ కధ కంచికేనా ?

seemandra congressఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విడగొడుతూ కాంగ్రెస్ అధిష్టానం గైకొన్న నిర్ణయం రాయలసీమ, ఆంద్ర ప్రాంతాల్లో ఆ పార్టీ కి శాపంగా పరిణమించేలా వుంది. కేవలంతన రాజకీయ స్వార్ధం కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం గైకొందనే అభిప్రాయం ఈ రెండు ప్రాంతాల ప్రజల మనస్సులో బలంగా నాటుకుంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ ఈ రాష్ట్రవిభజన కు పాల్పడిందని సీమాంధ్ర ప్రాంతాలలోని ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సమైక్యాంధ్ర కోరుకునే ప్రజల మనోభావాలను లెక్కచేయకుండా, కేవలం తెలంగాణా లో సీట్ల కోసమే కాంగ్రెస్ తాపత్రయ పడుతోందని, దీని ఫలితాన్ని రాబోయే ఎన్నికలలో ఈ రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ చవిచూస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవిభజన కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న అన్నిప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధి ల దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దగ్ధం చేస్తున్నారు. ” కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ ” ” సోనియాగాంధి డౌన్ డౌన్ ” అనే నినాదాలు హోరెత్తుతున్నాయి ఈ పరిణామాలను నిశితంగా గమనించిన వారెవరికైనా రానున్న రోజులలో ఆంద్ర, రాయలసీమ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనక తప్పదని ఇట్టే అర్ధమవుతుంది.

Exit mobile version