సూపర్‌ స్టార్‌ కొత్త రాజకీయ ఎత్తుగడ

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ దాదాపుగా రెండు దశాబ్దాల కాలంగా రాజకీయాల్లోకి వస్తాను, రాను అంటూ ఊగిసలాడుతున్నాడు. అయితే త్వరలో రాబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంకు రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రావడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాలను ఏలిన జయలలిత మరియు కరుణానిధిలు అస్తమించారు. దాంతో వారి లేని లోటు ఇప్పుడు తమిళ ప్రజలకు ఉంది. అందుకే ఈ సమయంలో రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే బెటర్‌ అంటూ అంతా అనుకుంటున్నారు. అందుకే రజినీకాంత్‌ రాజకీయ ఎంట్రీ కన్ఫర్మ్‌ అయ్యింది.

రజినీకాంత్‌ కొత్త పార్టీ పెడతాడని అంతా అనుకుంటున్నారు. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్‌ మరియు బీజేపీలను తమిళ జనాలు పట్టించుకోరు. ఎన్నో దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలే తమిళనాట సీఎం పీఠంను దక్కించుకుంటున్నాయి. అందుకే రజినీకాంత్‌ కూడా తన సొంత పార్టీ పెడతాడని అంతా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో బీజేపీలో జాయిన్‌ అయ్యి తమిళనాడులో బీజేపీని బలోపేతం చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో రజినీకాంత్‌ ఉన్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ రజినీకాంత్‌ బీజేపీలో జాయిన్‌ అయితే సీఎం క్యాండెట్‌గా రజినీకాంత్‌ను ప్రకటించి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. మరి రజినీకాంత్‌ మనసులో ఏముందో తెలియాలి అంటే మరికొంత కాలం వెయిట్‌ చేయాల్సిందే.