Site icon TeluguMirchi.com

పవన్ ను వైఎస్ బెదిరించాడా.. !!

ysr-pawan-kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అదీ కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రౌడీయిజాన్ని, లొంగదీతకు అద్దంపట్టే అంశం కావడం విశేషం. “వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో.. ఓ బలవంతమైన వ్యక్తి పవన్ వద్దకు వచ్చి.. తమకోసం ఓ చిత్రంలో నటించమని బెదిరించాడట” ఈ విషయాన్ని స్వయంగా పవన్ నే నిన్న (గురువారం) ’టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే, ఆ బలవంతమైన వ్యక్తి ఎవరు..?? చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాడా..?? కాదా..?? అనే విషయాలను పవన్ ప్రస్తావించలేదు. వైఎస్ హయాంలో ’ధనవంతుడు బలవంతుడిగా’ మారాడని పవన్ అన్నాడు.

గతంలోని వైఎస్ఆర్ పాలన గురించి మాట్లాడిన పవన్.. ప్రజెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ప్రస్తావించారు. జగన్ కు ఓటెయ్యుద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ కు ఓటు వేసి.. ఆయన పవర్ లోనికి వస్తే రాష్ట్ర పరిస్థితిని మరింత దరిద్రంగా తయారవుతుందని పవన్ పేర్కొన్నారు.

పవన్ ఇలా తన అనుభవాలను టైమ్స్ ఆఫ్ ఇండియాతో పంచుకున్నాడో లేదో.. వైకాపా నేతలు ఆయనను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం విశేషం. పవన్ వ్యాఖ్యలను వైకాపా నేతలు గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. వైకాపా పార్టీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. నీఛ రాజకీయాలకు పవన్ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పవన్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించారు. తెదేపాకు ఓట్లయమని పవన్ తో చెప్పించుకుంటున్నారు ఆమె  ఆరోపించారు. 2009లో ప్రత్యర్థిగా కనిపించిన బాబు 2014లో స్నేహితుడెలా అయ్యాడో తెలపాలని ఆమె పవన్ ను ప్రశ్నించింది. పవన్ చంద్రబాబు లా అండ్ ఆర్డర్ కింద పనిచేస్తున్నాడని అనంతపురం వైకాపా నేత టి. ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

అయితే, జనసేన పార్టీ స్థాపించిన నాటి (మార్చి 14) నుంచి పవన్ జగన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వైకాపా నేతల అవినీతి బాగోతాన్ని ఎండగడుతూ వస్తున్న పవన్ తాజాగా.. వైఎస్ఆర్ బెదిరింపు కథనాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించారు. ముందు ముందు.. మరెన్నీ సంచలనాలను పవన్ ప్రజల ముందు పెట్టనున్నాడో. ఏదేమైనా.. పవన్ తన ప్రత్యర్థులపై విమర్శనాబాణాలను  ఎక్కుపెడుతున్నట్లుగా కనిపిస్తోంది.

Exit mobile version