Site icon TeluguMirchi.com

ప్రకటనపై పవన్ వెనక్కి తగ్గాడా.. ??

pawankalyanరాజకీయాలపై తనకున్న అభిప్రాయాలపై పవన్ కళ్యాన్ స్పందించనున్న విషయం తెలిసిందే. మార్చి రెండో వారంలో పవన్ మీడియా ముందుకు వస్తానని పత్రికా ప్రకటన కూడా ఇచ్చాడు. అయితే, ఈరోజు (మార్చి 5)న పవన్ మీడియా ముందుకు రావచ్చని అందరూ భావించారు. తాజాగా, పవన్ ప్రకటన వాయిదా పడినట్లు సమాచారం. దీంతో.. పవన్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయితే, మార్చి 9, లేక 11న పవన్ మీడియా సమావేశం పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు, పవన్ రాజకీయాల్లోకి వచ్చే విషయంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ’పీఆర్ పీ’ పేరునే పవన్ రిపబ్లిక్ పార్టీగా రీ ఓపెన్ గా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.అదీకాకుంటే.. లోక్ సత్తా లేదా ఆప్ లో పార్టీ టికెట్ పై వచ్చే ఎన్నికల్లో బరిలో దిగుతాడని మరో వర్గం అభిమానులు వాదిస్తున్నారు.

అసలు, పవన్ రాజకీయాలకు వస్తాడా..? లేదా..?? ఈ రెండు కాకుండా.. కూల్ రాజకీయాలపై తనకున్న అభిప్రాయాన్ని మాత్రమే చెప్పేసి జరుగుతున్న హాట్ ప్రచారానికి తెరదించుతాడా..?? తదితర అంశాలకు సమాధానం తెలియాలంటే పవన్ మీడియా ముందుకు రావాల్సిందే. అందుకు మరికొన్ని రోజులు ఆగాల్సింది. పవన్ పొలిటికల్ ఎంట్రీ అప్ డేట్స్ కోసం బ్రౌజ్ చేస్తూనే వుండండి.. మీ తెలుగు మిర్చి డాట్ కామ్.

 

 

Exit mobile version