Site icon TeluguMirchi.com

కిరణ్ ఆపద్బాంధవుడేనా.. ??

cm kiranకిరణ్ కుమార్ పార్టీ పేరులోనే వైరుధ్యం. వివాదం ఉన్నాయి. ఆయన పెట్టబోతున్న పార్టీ పేరు. ’జై సమైక్యాంధ్ర’ పార్టీ. ఇంకా జై సమైక్యాంధ్ర పార్టీ ఏమిటి? రాష్ట్రాన్ని విడగొట్టి పారేశారు సోనియా. మరి ఇంకెక్కడ సమైక్యాంధ్ర? మిగిలింది అవశేషాంధ్రనే. విభజన తర్వాత మిగిలే ప్రాంతాల పేరు ఆంధ్ర ప్రదేశ్ గానే ఉంచింది కేంద్రం. కిరణ్ కుమార్ కు ఒకవేళ నిజంగానే ప్రేమ ఉంటే.. తన పార్టీకి జై ఆంధ్ర ప్రదేశ్ అని నామకరణం చేయవచ్చు. అయినా..ఇప్పుడసలు పార్టీ పెట్టే అవసరం కిరణ్ కుమార్ కి ఉందా అనే .ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో విఫలమైనందువల్లనే పార్టీ పెడుతున్నారా?? ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్ పార్టీ పెట్టినా అంతగా అడ్వాంటేజ్ రాదని పరిశీలకుల నిశ్చితాభిప్రాయం. గతంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చారిత్రక పరిణామాలు తోడయ్యాయి. అప్పట్లో కాంగ్రెస్ దుష్పరిపాలనతో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయింది. ఇప్పడు కిరణ్ పరిపాలన కూడా అంతకంటే తక్కువేమీ కాదు. అయినా అప్పటి నేపథ్యం వేరు. దశాబ్దాలుగా ఏకపార్టీ పరిపానతో విసిగి పోయి ఉన్నారు జనం. వారు సరైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న సమయమది. చిత్తశుద్ధి కలిగిన ఎన్టీఆర్, ఒక నిబద్ధతలో జనంలోకి వచ్చి నీరాజనాలందుకున్నారు.

తెలుగు దేశం పార్టీని స్థాపించి నిండా తొమ్మిది నెలలు కాలేదు. కానీ నాటికి నూరేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ను మట్టికరిచింది. కిరణ్ కి ఎన్టీఆర్ కి ఉన్నంత దృశ్యం లేదన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. కిరణ్ పార్టీకి.. కనీసం చిరంజీవి విలీన పార్టీ ప్రజారాజ్యానికి వచ్చినంత ఆదరణ లభించే అవకాశం ఉంటుందా? ఇదే రాజకీయ విశ్లేషకుల సందేహం.

ఎన్నో కొన్ని సీట్లు గెలిపించి.. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనమై ఆ పార్టీ ఉనికిని కాపాడటానికే కిరణ్ పార్టీ పనికి వస్తుంది. ఈ వ్యూహంతోనే కాంగ్రెస్ హైకమాండే కిరణ్ కుమార్ ని రంగంలోకి దించిందని హస్తినలో జోరుగా ప్రచారం సాగుతోంది. అంటే చిరంజీవిలా కిరణ్ ది కూడా ఇక మీదట ఆపద్బాంధవుడి పాత్రనేనన్నమాట. అయినా.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోనికి రావడం ప్రశ్నార్థకమే.

సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రిగా వచ్చే రికార్డు తనకు వద్దని, మరో ముఖ్యమంత్రికి ఆ క్రెడిట్ వస్తుందనీ కిరణ్ గతంలో గతంలో వ్యాఖ్యానించారు. అంటే రాజీనామాపై ముందే తనకు తెలుసునన్న మాట. కొత్త ముఖ్యమంత్రి వస్తారనీ తెలుసు. అయినా ఆయన్ని రాజీనామా అడిగిందెవరు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండమన్నది ఎవరు? ఆ బాధ్యతల నుంచి తప్పించండీ అని ప్రాధేయపడటం ఎందుకు? మీ ఉనికి కోసమే పార్టీ.. అంతే కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కాదన్న మాట. పైగా యువకులతో కలసి పోరాడతానని ఇప్పుడంటున్నారు. ఇదండీ… కిరణ్ పొలిటికల్ గేమ్……

Exit mobile version