చంద్రబాబు.. ఏపీ క్రేజీవాల్.. !!

aap-and-tdpస్థాపించిన యేడాది కాలంలోనే ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న ’ఆమ్‌ ఆద్మీ పార్టీ’ ప్రభావం మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలపై పడింది. ఆప్‌ చేసిన ప్రయోగాన్ని … అటువంటి ప్రచార సరిళిని, మానిఫెస్టో విధానాలను అనుసరించాలని నిర్ణయించాయి తెలుగు దేశం పార్టీ అధినేత. ప్రజాగర్జన పర్యటలనల్లో ప్రజలకు తెదేపా అవసరాన్ని విరిస్తూనే… మరో వైపు కార్యకర్తలకు కార్యోన్మఖులను చేసేందుకు సిద్దమయ్యారు. బ్రాడింగ్‌, మ్యానిఫెస్టో, ప్రచారం అనే మూడు అస్ర్తాలను ప్రయోగించబోతున్నారు. ఒంగోలులో జరిగిన ప్రజా గర్జనలో చంద్రబాబు ప్రసంగంలోనూ…. హితబోధలోనూ ప్రత్యేకతను చూపారు.

babuప్రతి నియోజవర్గానికి, పార్లమెంటు నియోజవర్గానికి, జిల్లాకు ప్రత్యేక మ్యానిఫెస్టోను సమర్పించిన వారికే ’బి ఫాం’లు ఇస్తామంటూ చంద్రబాబు చేసిన హెచ్చరిక చేశారు. అధినేత చేసిన హెచ్చరిక తెదేపా నాయకుల్లో ఆలోచనలు రేపింది. ఒంగోలు అశేష జన సందోహం సాక్షిగా గంటన్నర పాటు ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ప్రత్యర్థి పార్టీలపై అస్ర్తాలను ఎక్కు పెడుతూ పార్టీ అవసరాన్ని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి ఎందుకు రావాలన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో సఫలీకృతులయ్యారు. వేలాది మంది పాల్గొన్న ఈ సభలో చంద్రబాబు అద్యంతం ఆకట్టుకునే ప్రసంగం చేశారు.  అంతేకాకుండా..  పలు కీలక అంశాలపై బాబు..  తన వైఖరిని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ తరహా వేతనాలతో పాటు, నది జలాల అనుసంధానం, నల్లధనం వెలికితీత, కాపులకు బిసిలకు చేర్చే అంశంను, పరిశ్రమల కమీషన్‌ ఏర్పాటు లాంటి అంశాలను ప్రసంగంలో ఉదహరించారు

ncbn ఆప్‌ అనుసరించిన పలు వినూత్న రీతులను చంద్రబాబు అనుసరించబోతున్నారన్న విషయాన్ని కార్యకర్తలతో జరగిన సమావేశంలోనూ వెల్లడించారు. నియోజకవర్గాల, పార్లమెంటు,జిల్లా స్థాయిల్లో మ్యానిఫెస్టోలు తయారు చెయ్యాలని ఆదేశించారు. అలా మ్యానిఫెస్టోలు చెయ్యలేని వారు అక్కర్లేదంటూ అల్టిమేటం ఇచ్చారు. అంతే కాకుండా ఇతర పార్టీలకు భిన్నంగా వ్యవహరించాలని ఒక్కో కార్యకర్త బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించాలన్నారు. పసుపు టీ షర్టు ధరించడం, వాహనాలకు స్టిక్కర్లు, ఇంటికో జెండా లాంటి కార్యక్రమాల ద్వారా తటస్థ ఒటర్లను ఆకర్షించాలన్నారు. టీమ్‌ లుగా తయ్యారయ్యి పని చేయ్యాలన్నారు. వంద రోజులే ఉన్నాయంటూ చంద్రబాబు దిశనిర్ధేశం చేశారు. వంద రోజు ల్లో కార్యక్రమాలను సన్నద్ధంగా ఉండాలన్నారు. యాప్‌ లు, ఐవి ఆర్‌ ఎస్‌ లు, ఫేస్‌ బుక్‌ లతో పాటు ప్రత్యేక స్టాఫ్‌ వేర్‌ ద్వారా ఫోన్‌ లో పాటలు, స్లోగన్లు, పార్టీ కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు. మొత్తానికి.. చంద్రబాబు ఏపీ క్రేజీవాల్ గా మారనున్నాడన్న మాట..